Ashes: దుమ్ములేపిన మిచెల్ స్టార్క్.. 334 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌట్‌

by Kema Shiva Kumar |

అత్యంత ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ (Ashes Series)లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లాండ్‌ (England) మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది.

Ashes: దుమ్ములేపిన మిచెల్ స్టార్క్.. 334 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌట్‌
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ (Ashes Series)లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లాండ్‌ (England) మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. మిచెల్ స్టార్క్ దెబ్బకు 9 వికెట్లు కోల్పోయి 325 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 138 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ జాక్ క్రాలీ 76 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వచ్చిన జోఫ్రా ఆర్చర్ 38 పరుగులు జోడించడంతో ఇంగ్లీష్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. బెన్ డకెట్, ఓలీ పోప్, జెమీ స్మిత్, బ్రైడన్ కార్స్ సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు. బెన్ స్టోక్స్ (19), విల్ జాక్స్ (19), గస్ అట్కిన్సన్ (4) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు, మైఖేల్ నెసర్, స్కాట్ బోలాండ్, పాట్ కమిన్స్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.

కీలక వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బ్రైడన్ కార్సే బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ (33) గస్ అట్కిన్సన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి మార్నస్ లబుషేన్ వచ్చాడు. మరో ఎండ్‌లో జేక్ వెదర్‌ల్యాండ్ 40 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కంటే 257 పరుగుల వెనుకంజలో ఉంది

Next Story