- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ashes: 132 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్.. ఇంగ్లాండ్ విజయలక్ష్యం ఇదే!
యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లాండ్ (England) మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ రసవత్తరంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లాండ్ (England) మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆసీస్‌కు 42 పరుగుల ఆధిక్యం లభించింది. 4 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ట్రావిస్ హెడ్ (46), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (24) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు చేశారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే 4 వికెట్లు, బెన్ స్టోక్స్ 3, జోష్ టంగ్ 2, గస్ అట్కిన్‌సన్ 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం 175 పరుగుల విజయలక్ష్యంతో క్రీజ్‌లోకి వచ్చిన ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (14), బెన్ డకెట్ (10) నెమ్మదిగా ఆడుతూ.. జట్టును విజయతీరాలకు చేర్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు వికెట్లు ఏమి కోల్పోకుండా 24 పరుగులు చేసింది.






