- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీ రిటైర్మెంట్ పై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అంటే చాలా మందికి రాజకీయనాయకుడిగానే తెలుసు. కానీ ఆయన ఒకప్పుడు మంచి క్రికెటర్ అన్న విషయం చాలా మందికి తెలియదు.

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అంటే చాలా మందికి రాజకీయనాయకుడిగానే తెలుసు. కానీ ఆయన ఒకప్పుడు మంచి క్రికెటర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. నైన్టీస్ ప్రారంభంలో అసదుద్దీన్ ఇంటర్ యూనివర్సిటీ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ టీమ్ ఇండియా క్రికెటర్ ఫేస్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కంటే ఉత్తమ ప్రతిభ కనభర్చారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అసదుద్దీన్ గుర్తు చేసుకున్నారు. 79 పరుగులకే తాను 6 వికెట్లు తీస్తే వెంకటేష్ ప్రసాద్ ఒక్క వికెట్ కూడా తీయలేదని చెప్పారు.
కానీ ఆ టోర్నమెంట్‌లో చివరికి బెంగుళూరు యూనివర్సిటీ జట్టు హైదరాబాదీ జట్టుపై విజయం సాధించిందని చెప్పారు. కోహ్లీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ..జబర్దస్త్ ప్లేయర్ అంటూ కితాబిచ్చారు. విరాట్ కవర్ డ్రైవ్ ను ఎప్పటికీ మిస్ అవుతామని అన్నారు. చాలా గొప్ప ఆటగాడు అని చెప్పారు. కానీ దేశంలో మరింత మంది కోహ్లీలు వస్తారని అన్నారు. మన దేశంలో టాలెంట్ కొదవలేదని చెప్పారు. అంతే కాకుండా హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ పేద కుటుంబం నుండి వచ్చి సక్సెస్ అయ్యాడని చెప్పారు. టెస్ట్ క్రికెట్ లో వంద వికెట్లు తీశాడని అన్నారు. సిరాజ్ ఇండియాకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.






