- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాహిద్ అఫ్రిది పెద్ద జోకర్.. దేనికి పనికి రాడు - అసదుద్దీన్ ఒవైసీ
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిపై ( Shahid Afridi ) అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) సీరియస్ అయ్యారు. ఆఫ్ర

దిశ వెబ్ డెస్క్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిపై ( Shahid Afridi ) అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) సీరియస్ అయ్యారు. ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలపై.. స్పందిస్తూ.. వాడు పెద్ద జోకర్ అంటూ విమర్శలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. పనికిరాని వాళ్ల గురించి మాట్లాడడం.. దండగ అంటూ చురకులు అంటించారు. పహాల్గం సంఘటన (pahalgam terror attack) జరిగిన నేపథ్యంలో... ఇండియన్ ప్రభుత్వం పై షాహిద్ ఆఫ్రిది విమర్శలు చేశారు. భారత ఆర్మీ పై ( Army ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఆర్మీ వైఫల్యం అలాగే చేతగానితనంతోనే... పహల్గాం ఘటన జరిగిందని బాంబు పేల్చారు అఫ్రిది.
భారత సైన్యం తమ తప్పిదాలను... కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ పైన ( Pakisthan ).. ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడు పెద్ద జోకర్ అంటూ మండిపడ్డారు. అదే సమయంలో... పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ను fatf గ్రేట్ లో చేర్చాలని... కోరారు. సైబర్ దాడులతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కింద మిలటరీ యాక్షన్ తీసుకోవాలని అభ్యర్థించారు.
తమ దగ్గర అనుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో అమాయకులను చంపితే.. ఏ దేశం కూడా ఊరికే ఉండదని హెచ్చరించారు. పాకిస్తాన్ వాళ్లు పోను పోను... ఐఎస్ఐఎస్ కి వారసులుగా మారుతున్నారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరిచేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని ( Prime Minister Narendra Modi ) డిమాండ్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ.






