- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US Open : యూఎస్ ఓపెన్ 2025 విజేతగా అరీనా సబలెంక
బెలారస్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ వన్ సబలెంక యూఎస్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (US Open) యూఎస్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా అరీనా సబలెంక (Aryna Sabalenka) నిలిచారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా (Amanda Anisimova)పై 6-3, 7-6(3) తేడాతో సబలెంక (GRAND SLAM TITLE) టైటిల్ కైవసం చేసుకుంది. ఒక గంటా 34 నిమిషాల్లో ఆట ముగిసింది. రెండు సెట్లలోనూ సబలెంక సత్తాచారు. ఫైనల్‌లో సబలెకం పూర్తి ఆధిపత్యం చెలాయించి గెలుపుపొందారు. ఈ గెలుపుతో బెలారస్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ వన్ సబలెంక యూఎస్ ఓపెన్‌లో వరుసగా రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించింది.
దిగ్గజ టెన్నిస్ స్టార్ సెరినా విలియమ్స్ తర్వాత యూఎస్ ఓపెన్ టైటిల్ (2024 టైటిల్)ను కాపాడుకున్న మొదటి క్రీడాకారిణిగా సబలెంక నిలిచారు. సబలెంక కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్. రెండు ఆస్ట్రేలియన్ ఎపెన్‌లు, రెండు యూఎస్ ఓపెన్‌లను తాను సొంతం చేసుకుంది. మరోవైపు యూఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్ నేడు జరగనుంది. టాప్ సీడ్ యూనిక్ సినర్‌తో రెండో సీడ్ కార్లోస్ అల్కరాస్ ఫైనల్లో ఫైట్ చేయనున్నారు.
సెమీస్‌లో యుకీ జోడీ ఇంటిదారి..
కాగా, భారత టెన్నిస్ ప్లేయర్ యుకీ బాంబ్రీ చరిత్ర సృష్టించడానికి కొద్ది దూరంలో ఆగిపోయాడు. పురుషుల డబుల్స్‌లో మైఖేల్ వీనస్(న్యూజిలాండ్)తో కలిసి సంచలన విజయాలు సాధించిన అతను సెమీస్‌లో బోల్తా పడ్డాడు. ఇంగ్లాండ్‌కు చెందిన నీల్ స్కుప్సీ-జో సాలిస్‌బరీ జోడీ చేతిలో 7-6(7-2), 6-7(5-7), 4-6 తేడాతో యుకీ జంట ఓడిపోయింది. విజయం కోసం యుకీ, వీనస్ గట్టిగానే పోరాడారు. తొలి సెట్ నెగ్గి శుభారంభం చేశారు. కానీ, ఆ తర్వాత ప్రత్యర్థులు పుంజుకోవడంతో వారికి ఓటమి తప్పలేదు.






