- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మియామీ ఓపెన్ గెలిచిన అరినా సబలెంక
ఫైనల్‌లో నేను అత్యుత్తమ టెన్నిస్‌ను ఆడానని విజేతగా నిలిచిన తర్వాత సబలెంక వ్యాఖ్యానించింది.

- జెస్సికాను ఓడించిన వరల్డ్ నంబర్ 1
- ఇండియన్ వెల్స్ ఫైనల్‌లో ఓడిన అరినా
- మియామీ ఓపెన్‌లో నిలకడగా రాణించిన సబలెంక
దిశ, స్పోర్ట్స్: ప్రపంచ నంబర్ 1 ర్యాంకర్ అరినా సబలెంక ఖాతాలో మరో టైటిల్ చేరింది. హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన మియామీ ఓపెన్ డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్ ఫైనల్‌లో అరినా సబలెంక అమెరికాకు చెందిన జెస్సికా పెగులాను 7-5, 6-2 తేడాతో విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. జనవరిలో బ్రస్బేన్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత ఈ సీజన్‌లో రెండో టైటిల్ సొంతం చేసుకుంది. కాగా, సబలెంక మియామీ ఓపెన్ గెలవడం ఇదే తొలిసారి. ఈ నెల మొదట్లో ఇండియన్ వెల్స్‌లో జరిగిన ఫైనల్‌లో రష్యాకు చెందిన 17 ఏళ్ల మిర్రా ఆండ్రీవా చేతిలో ఓడిపోయిన సబలెంక.. ఈ సారి ఫైనల్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా విజయం సాధించింది. మొదటి సెట్‌లో ఏడు సార్లు సర్వీస్ బ్రేక్ చేసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు సర్వీస్ నిలబెట్టుకోవడానికి తీవ్రంగా కష్టపడ్డారు. కానీ 6-5 తేడాతో పెగులా సర్వ్ చేసినప్పుడు వేగం మారిపోయింది. దీన్ని సబలెంక అడ్వాంటేజ్‌గా తీసుకొని ముందుకు వెళ్లింది. సున్నితమైన ఫోర్‌హ్యాండ్ డ్రాప్ షాట్‌ను ఆడి పైచేయి సాధించింది. ఇక రెండో సెట్‌లో సబలెంక మరింత సులభంగా సెట్‌ను గెలిచి.. విజేతగా నిలిచింది.
ఈ ట్రోఫిని గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్‌లో నేను అత్యుత్తమ టెన్నిస్‌ను ఆడానని విజేతగా నిలిచిన తర్వాత సబలెంక వ్యాఖ్యానించింది. కాగా, గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో పెగులాపై విజయం సాధించిన సబలెంక.. ఆమె ఆటకు అభినందనలు తెలిపారు.పెగులాను సబలెంక ఎదుర్కోవడం ఇది మూడో సారి. మూడు సార్లు కూడా సబలెంకదే పై చేయి అయ్యింది. కాగా, ప్రపంచంలోని అత్యుత్త హార్డ్-కోర్ట్ క్రీడాకారిణుల్లో సబలెంక ఒకరిగా భావిస్తున్నట్లు పెగులా పేర్కొన్నది.






