- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australian Open : హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసిన సబలెంక.. ఫైనల్‌లో కీస్ తాడోపేడో
వరల్డ్ నం.1 టెన్నిస్ క్రీడాకారిణి సబలెంక(బెలారస్) మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దక్కించుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది.

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ నం.1 టెన్నిస్ క్రీడాకారిణి సబలెంక(బెలారస్) మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దక్కించుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ డిఫెండింగ్ చాంపియన్ వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు ఎడిషన్లలో విజేతగా నిలిచిన ఆమె హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేసింది. ఫైనల్‌లో అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్‌తో తలపడనుంది. గురువారం జరిగిన సెమీస్‌లో సబలెంక 6-4, 6-2 తేడాతో స్పెయిన్ క్రీడాకారిణి బడోసాను మట్టికరిపించింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె గంటా 26 నిమిషాల్లోనే రెండు సెట్లలో నెగ్గింది. తొలి సెట్‌లో బడోసా పోటీనిచ్చినప్పటికీ సబలెంక రెండు సార్లు సర్వీస్‌లను బ్రేక్ చేసి సెట్‌ను తనకు అనుకూలంగా మార్చేసుకుంది. ఇక, రెండో సెట్‌లో ఆమెదే పూర్తి హవా. 3వ, 5వ గేముల్లో బ్రేక్ పాయింట్ సాధించడంతో విజయం సునాయాసమైంది. సబలెంక 32 విన్నర్లు బాదగా.. బడోసా 11 విన్నర్లే కొట్టింది. బడోసా 4 డబుల్ ఫౌల్ట్స్, 15 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
స్వైటెక్‌కు షాక్.. కీస్ ఫైనల్‌కు
వరల్డ్ నం.2 క్రీడాకారిణి ఇగా స్వైటెక్(పొలాండ్) జోరుకు బ్రేక్ పడింది. సెమీస్‌లో ఆమెకు అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ షాకిచ్చి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో కీస్ 5-7, 6-1, 7-6(10-8)తేడాతో స్వైటెక్‌ను ఓడించింది. మ్యాచ్‌లో మొదట ఆరంభం స్వైటెక్‌దే. కీస్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొని మరి తొలి సెట్‌ను సాధించింది. అయితే, రెండో సెట్‌లోనే కీస్ బదులిచ్చింది. ఏకపక్షంగా రెండో సెట్‌ను సొంతం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు మళ్లించింది. అక్కడ ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. చివరికి కీస్ టై బ్రేకర్‌లో మూడో సెట్‌లో నెగ్గి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దీంతో ఐదు గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన స్వైటెక్‌కు తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కల మరోసారి సెమీస్‌లోనే చేజారింది.
- Tags
- #Australian Open






