- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు.. మొదటి మ్యాచులోనే భారీ షాట్లు
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సేహ్వాగ్ కుమారుడ్ ఆర్యవీర్ సేహ్వాగ్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఆట తీరు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. భయం లేని ఆట తీరుతో ఆయన ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. అటువంటి సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) క్రికెట్ ప్రపంచంలోకి అరంగేట్రం చేశాడు. 17 ఏళ్ల అతను ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో స్థానం దక్కించుకున్నాడు. మొదటి నుంచి తండ్రిని పోలిన షాట్లతో అలరిస్తూ వచ్చిన ఆర్యవీర్.. తన మొదటి మ్యాచ్‌లో వేగం చూపించాడు. బుధవారం సాయంత్రం అరుణ్ జైట్లీ స్టేడియంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ (East Delhi Raiders) జట్టు తరఫున ఆర్యవీర్ అరంగేట్రం చేశాడు.
కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కింగ్స్ ఇన్నింగ్స్‌లోని రెండవ ఓవర్‌లో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ నవదీప్ సైనీ (Navdeep Saini)పై వరుసగా బౌండరీలు కొట్టి ప్రేక్షకులను అలరించాడు. సేహ్వాగ్ కుమారుడు కావడంతో అతనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి మ్యాచులో అతను ఆడిన అన్ని షాట్లు సేహ్వాగ్ షాట్లను గుర్తు చేశాయని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు చర్చించుకుంటున్నారు. అతని మొదటి మ్యాచుకు సంబంధించిన హైలెట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






