ICC champions Trophy 2025: చిన్నారి అభిమానికి అర్ష్‌దీప్‌ స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్

by Yella Dhawani Reddy |

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో (ICC champions Trophy 2025) టీమిండియా విజేతగా నిలిచింది.

ICC champions Trophy 2025: చిన్నారి అభిమానికి అర్ష్‌దీప్‌ స్పెషల్ గిఫ్ట్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో (ICC champions Trophy 2025) టీమిండియా విజేతగా నిలిచింది. 2013లో చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కప్‌ను అందుకుంది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు దుబాయ్ గ్రౌండ్‌లనే సంతోషంతో సందడి చేశారు. ఈ క్రమంలో టీమిండియా యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా సంబరాల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో యువ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ తన చిన్నారి అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఓ హెల్మెట్‌పై సంతకం చేసి ఆ చిన్నారి అభిమానికి అందజేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

కాగా, ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా... మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది.

Next Story