- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్.. ఆ రన్స్‌తో హ్యాపీగా ఉన్నావా?.. హిట్‌మ్యాన్‌పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచన చేశాడు. 25-30 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయాలని సూచించాడు. ఇటీవల కాలంలో రోహిత్ జట్టుకు మెరుపు ఆరంభాలు ఇస్తూ త్వరగానే అవుటవుతున్నాడు. ఆసిస్‌తో మ్యాచ్ తర్వాత రోహిత్ ఆట తీరును హెడ్ కోచ్ గంభీర్ సమర్థించాడు. అతని ప్రభావాన్ని అంచనా వేయాలని, రన్స్‌ను కాదన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ వ్యాఖ్యలపై గవాస్కర్ స్పందిస్తూ.. అది సరైన పద్ధతి కాదని, రోహిత్ చాలా సేపు బ్యాటింగ్ చేయాలన్నాడు. 25-30 ఓవర్లు క్రీజులో ఉంటే అతను మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి దూరం చేస్తాడని చెప్పాడు. 25-30 రన్స్ చేయడం ద్వారా సంతోషంగా ఉన్నావా? అని రోహిత్‌ను ప్రశ్నించాడు. ‘అతను 25 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తే భారత్ స్కోరు 180-200 ఉంటుంది. అప్పటికి రెండు వికెట్లే పడి ఉంటే ఓ సారి ఊహించుకోండి స్కోరు 350 లేదా అంతకంటే ఎక్కువే చేస్తుంది. రోహిత్‌కు చెప్పేది ఒక్కటే. 7, 8, 9 ఓవర్లు కాకుండా 25 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేస్తే జట్టుపై ప్రభావం ఉంటుంది.’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.






