ఇంగ్లాండ్ తో టెస్ట్... టీమిండియాలోకి అన్షుల్ కాంబోజ్

by velandi.Saikiran |

టీం ఇండియా (Team India)వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదు

ఇంగ్లాండ్ తో టెస్ట్... టీమిండియాలోకి అన్షుల్ కాంబోజ్
X

దిశ, వెబ్ డెస్క్ : టీం ఇండియా (Team India)వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. ఇందులో ఇంగ్లాండ్ రెండు గెలవగా టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. మరో రెండు రోజుల్లోనే నాలుగో టెస్ట్ కూడా ప్రారంభం కానుంది. అంటే జూలై 23వ తేదీ నుంచి మాంచెస్టర్ (Manchester) వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది.

టీమిండియా జట్టులోకి కొత్త ప్లేయర్ ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసింది. భారత ఫేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ను ( Anshul Kamboj) జట్టులోకి తీసుకువచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం (BCCI ) తీసుకున్నట్లు చెబుతున్నారు. నాలుగో టెస్ట్ లో... ఇతని ఆడించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్ దీప్ కు తాజాగా ఎడమ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో జట్టు నుంచి అతన్ని తప్పించారు. ఇలాంటి నేపథ్యంలోనే టీమ్ ఇండియా ఏ తరఫున బాగా రాణిస్తున్న అన్షుల్ కు టీమిండియాలో అవకాశం కల్పించారు. అయితే ఇతన్నీ నాలుగో టెస్ట్ లో ఆడిపిస్తారా ? లేదా మూడో టెస్టులో ఆడిన జట్టును కొనసాగిస్తారా అనేది చూడాలి.

Next Story