రెండు టెస్ట్ కంటే ముందు టీమిండియాకు మరో షాక్..

by velandi.Saikiran |

టీమ్ ఇండియా ( TEAM INDIA) వర్సెస్ ఇంగ్లాండ్ (ENGLAND) మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ

రెండు టెస్ట్ కంటే ముందు టీమిండియాకు మరో షాక్..
X

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా ( TEAM INDIA) వర్సెస్ ఇంగ్లాండ్ (ENGLAND) మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ పూర్తయింది. ఇందులో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో రెండో టెస్ట్ కు ఇంగ్లాండ్ అలాగే టీమిండియా రెడీ అవుతున్నాయి. రేపటి రోజున.. ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఎడ్జ్ బస్టన్ వేదికగా (Edgbaston) ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఓవరాల్ గా 8 మ్యాచ్ లు ఆడిన టీమిండియా... ఒకే ఒక్క మ్యాచ్ ను డ్రా చేసుకోగలిగింది. మిగిలిన అన్ని మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో ఇప్పుడు టీం ఇండియాకు కొత్త టెన్షన్ మొదలైంది. ఈ మ్యాచ్ కూడా గెలుస్తామా లేదా అనే ప్లేయర్లతో పాటు అభిమానులకు కూడా తలెత్తుతోంది.

ఇంగ్లండ్ XI : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (WK), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్

టీమిండియా XI : యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (c), కరుణ్ నాయర్, రిషబ్ పంత్ (vc & wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Next Story