సచిన్‌కు మరో అరుదైన గౌరవం.. BCCI హెడ్‌క్వార్టర్స్‌లోని గదికి ‘SRT 100’ పేరు

by Kema Shiva Kumar |

క్రికెట్ రారాజు, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar)కు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

సచిన్‌కు మరో అరుదైన గౌరవం.. BCCI హెడ్‌క్వార్టర్స్‌లోని గదికి ‘SRT 100’ పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ రారాజు, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్‌ (Sachin Tendulkar)కు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ముంబైలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హెడ్ కార్టర్‌లోని ఓ గదికి ‘SRT 100’‌గా నామకరణం చేసి ప్రారంభించారు. అనంతరం బీసీసీఐ ప్రతినిధులు మాట్లాడుతూ.. బీసీసీఐ ప్రధాన కార్యాయంలో ఓ గదికి మాస్టర్ బ్లాస్టర్ పేరు పెట్టామని వెల్లడించారు. భారత క్రికెట్‌కు ఆయన చేసిన అసాధారణ కృషిని గుర్తించి తాము ఈ పని చేశామని పేర్కొన్నారు. ‘SRT 100’ గది ప్రారంభోత్సవ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో పాటు బీసీసీ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ రోహన్ దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story