రెండో టెస్ట్ కంటే ముందే.. టీమిండియాకు మరో షాక్ !

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో.. గిల్ సేన కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

రెండో టెస్ట్ కంటే ముందే.. టీమిండియాకు మరో షాక్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో.. గిల్ సేన కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన టీమ్ ఇండియా... రెండు టెస్టులో ఎలాగైనా గెలవాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

జూలై 2వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కాబోతోంది. అయితే జూలై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో... ఇప్పటికే బుమ్రాకు రెస్ట్ ఇవ్వబోతున్నట్లు నిన్నటి నుంచి చర్చ జరుగుతోంది. బుమ్రా ఆడకపోతే హర్షిత్ రానా లేదా అర్ష్‌దీప్‌ సింగ్‌ ను బరిలోకి దించే ఛాన్స్ ఉంది. బుమ్రా టీమిండియాలో లేకపోతే మ్యాచ్ గెలవడం చాలా కష్టమని చెబుతున్నారు.

అయితే ఆ బాధలో ఉన్న టీమిండియా కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రెండు టెస్టుకు భారత స్టార్ ఆటగాడు ప్రసిద్ కృష్ణ ను కూడా పక్కన పెట్టే ఛాన్సులు ఉన్నాయట. అతను ప్రాక్టీస్ సమయంలో గాయపడినట్లు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే... ఆకాష్ దీప్ జట్టులోకి వస్తా డని అంటున్నారు. అంటే ఇప్పుడు రెండో టెస్ట్ కు టీమిండియా స్టార్ బౌలర్లు ఇద్దరు కూడా దూరం కాబోతున్నారన్నమాట. ఒకవేళ ఇదే జరిగితే టీమిండియా గెలవడం కష్టమే అంటున్నారు.

Next Story