- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB కి కొత్త టెన్షన్... వణికిపోతున్న ఫ్యాన్స్ !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న ప్లేయర్లు గాయాల బారిన పడగా.. తాజాగా టీమ్ డేవిడ్ కూడా ఇంజురయ్యాడు. సన్రైజర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ లో గెలవాల్సిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దారుణంగా ఓడిపోయింది. చివరలో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన సమయంలో... టిమ్ డేవిడ్ ఒకే ఒక్క పరుగుకు అవుట్ అయ్యాడు. ఆ ఒక్క పరుగు కోసం ఐదు బంతులు ఆడాడు టీమ్ డేవిడ్. వాస్తవానికి ఈ మ్యాచ్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు టిమ్ డేవిడ్ కు గాయమైంది.
అయినప్పటికీ బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అదే టిమ్ డేవిడ్ బాగా ఆడితే.. శుక్రవారం మ్యాచ్ లో హైదరాబాద్ పైన గెలిచేది బెంగళూరు. ప్లే ఆప్స్ కంటే ముందు టీమ్ డేవిడ్ ఇలా గాయపడడం... బెంగళూరు అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే రజత్ గాయంతో బాధపడుతూ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్నాడు. తాజాగా టిమ్ డేవిడ్ కూడా గాయపడ్డాడు. ఇలాంటి సమయంలో ఆర్సిబి కప్ గెలుస్తుందని నమ్మకాన్ని క్రమక్రమంగా అభిమానులు కోల్పోతున్నారు.
Why these Clown 🤡 Even tried to play Tim David
— Kamran★ (@parody_col) May 23, 2025
Hil Nhi Pa Raha hai Banda
Acha hua OUT ho gya
1 Match>>> His Availablity
Rajat Patidar - #RCBvsSRH #SRHvsRCB pic.twitter.com/wWDa2x7QHT






