Jasprit Bumrah: ఇంగ్లండ్ టూర్‌లో కెప్టెన్‌గా బుమ్రాకు ఛాన్స్ ఇవ్వాలి: కుంబ్లే

by Phanindra |   (  Updated:2025-05-08 14:27:50  IST  )

ఇంగ్లండ్ టెస్టు సిరీసులో కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను నియమించాలని అనిల్ కుంబ్లే సూచించాడు. అతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలన్నాడు.

Jasprit Bumrah: ఇంగ్లండ్ టూర్‌లో కెప్టెన్‌గా బుమ్రాకు ఛాన్స్ ఇవ్వాలి: కుంబ్లే
X

దిశ, స్పోర్ట్స్: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్ అవడంతో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీసులో టీమిండియా సారధి ఎవరనే అంశంపై తెగ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోహిత్ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) టెస్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్‌కు పంపాలని లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ సాధించిన ఏకైక విజయం బుమ్రా సారధ్యంలోనే వచ్చిన విషయాన్ని కుంబ్లే గుర్తుచేశాడు.

‘కేవలం ఇంగ్లండ్ సిరీస్‌కైనా సరే బుమ్రాను కెప్టెన్ చేసి, అతని ఫిట్‌నెస్ ఎలా ఉందో చూడండి.తను పలుసార్లు గాయాలపాలైనట్లు నాకు తెలుసు. కానీ బుమ్రాకు ఒక అవకాశం ఇవ్వాలి’ అని కుంబ్లే అన్నాడు. ఫాస్ట్ బౌలర్‌గా ఉండటం అంత సులభం కాదని, బుమ్రా (Jasprit Bumrah) గాయాలపాలవడం సహజమేనని వివరించాడు.

ఇంగ్లండ్‌లో జరిగే ఐదు టెస్టుల్లో బుమ్రా ఆడటంపై కూడా కుంబ్లే అనుమానం వ్యక్తం చేశాడు. అయినా సరే తనను సారధిగా ఉంచి, వైస్‌కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయాలని సూచించాడు. ఒకవేళ బుమ్రా ఏదైనా కారణంతో ఆడలేకపోతే జట్టుకు గిల్‌ సారధ్యం వహిస్తాడని చెప్పుకొచ్చాడు.

Next Story