శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ సంచలన నిర్ణయం

by Harish |

శ్రీలంక సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ సంచలన నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టులకు శుక్రవారం ప్రకటించాడు. జూన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టే తనకు చివరిదని వెల్లడించాడు. సోషల్ మీడియా వేదికగా మాథ్యూస్ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ‘అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైంది. జూన్‌లో బంగ్లాదేశ్‌తో ఆడే తొలి టెస్టే నా దేశం తరపున ఆడే చివరి రెడ్ బాల్ మ్యాచ్. వైట్‌బాల్ ఫార్మాట్‌లో జట్టుకు అందుబాటులో ఉంటా.’అని తెలిపాడు. యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాడు. 2009లో టెస్టు అరంగేట్రం చేసిన మాథ్యూస్ శ్రీలంక తరపున 118 టెస్టులు ఆడి 8,167 రన్స్ చేశాడు. టెస్టు క్రికెట్‌లో శ్రీలంక తరపున కుమార్ సంగక్కర, మహేలా జయవర్ధనే తర్వాత అత్యధిక రన్స్ చేసిన మూడో ప్లేయర్ మాథ్యూస్.అలాగే, 2013 నుంచి 2017 వరకు మూడు ఫార్మాట్లలో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.


Next Story