- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆండీ పైక్రాఫ్ట్ రిప్లయ్‌తో.. సంజూ క్యాచ్‌పై ఐసీసీకి పాక్ ఫిర్యాదు!
సంజూ అందుకున్న క్యాచ్‌పై పాకిస్తాన్ అసహనం వ్యక్తంచేసింది. ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్ాయదు చేస్తే అతను తీసుకోలేదు. దీంతో ఏకంగా ఐసీసీకి ఫిర్యాదు చేసిందట.

దిశ, స్పోర్ట్స్: అంపైర్ ఆండీ పైక్రాఫ్ట్‌తో పాకిస్తాన్‌కు మరోసారి సమస్య ఎదురైంది. సూపర్-4లో భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్.. తమ ప్లేయర్ ఫఖర్ జమాన్ అవుట్‌పై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ మ్యాచులో సంజూ శాంసన్ తీసుకున్న క్యాచ్ క్లీన్‌గా లేదని పాక్ ఆరోపించింది. బంతి అతని చేతుల్లోకి వెళ్లే ముందు నేలపై బౌన్స్ అయిందని వాదించింది. ఈ క్రమంలోనే థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తంచేసింది. ఈ క్రమంలోనే పాక్ టీం మేనేజర్ నవీద్ చీమా ఈ క్యాచ్ విషయంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్యాదు చేశాడట.
అయితే దీన్ని తిరస్కరించిన పైక్రాఫ్ట్.. అది అతని చేతుల్లో లేని అంశమని తేల్చిచెప్పడంతో ఏం చెయ్యాలో తెలియలేదట. చివరకు ఐసీసీకి కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫిర్యాదు చేస్తూ పాక్ టీం ఈమెయిల్ పంపినట్లు సమాచారం. ఈ క్యాచ్ క్లీన్‌గా లేదని, అంపైర్లు కూడా తప్పులు చేస్తారని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా వాదించిన సంగతి తెలిసిందే.






