ఆంధ్ర జట్టుకు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్యారీ స్టీడ్ నియామకం

by Harish |

రంజీ క్రికెట్ సీజన్‌కు ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్ర జట్టుకు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్యారీ స్టీడ్ నియామకం
X

దిశ, విజయవాడ : రంజీ క్రికెట్ సీజన్‌కు ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) విన్నింగ్ కోచ్,న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర గ్యారీ స్టీడ్‌‌ను ఆంధ్ర జట్టుకు హెడ్ కోచ్‌‌గా నియమించింది. ఆటగాళ్లకు నైపుణ్యమున్న శిక్షణ అందించేందుకు స్టీడ్‌‌ను నియమించినట్టు ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ తెలిపారు. స్టీడ్‌కు కోచింగ్‌లో విస్తృతమైన అనుభవం ఉంది. న్యూజిలాండ్‌‌కు ఏడేళ్లపాటు సేవలందించాడు. అతని కోచింగ్‌లోనే కివీస్ టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో నం.1 జట్టుగా నిలిచింది. అంతేకాకుండా, 2021లో డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచింది. 2019 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది జూన్‌లో కివీస్‌తో ఒప్పందం ముగిసింది. ఆంధ్ర జట్టుతో అతను రెండేళ్లు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. వారం రోజుల్లో అతను విశాఖపట్నం రానున్నాడు.


Next Story