డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ రికార్డు

by Harish |

భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2-2తో సమంగా ముగిసిన విషయం తెలిసిందే.

డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2-2తో సమంగా ముగిసిన విషయం తెలిసిందే. ఆసక్తికరంగా సాగిన ఈ ఐదు టెస్టుల సిరీస్‌ క్రికెట్ అభిమానులను అసలైన టెస్టు మజాను అందించింది. స్టేడియాలకు అభిమానులను క్యూకట్టారు. అలాగే, డిజిటిల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా లక్షల్లో మ్యాచ్‌లను వీక్షించారు. ఈ క్రమంలోనే డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కొత్త రికార్డును నెలకొల్పింది. మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను మొత్తం 170 మిలియన్ల వ్యూయర్స్ వీక్షించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్షించిన టెస్టు సిరీస్‌గా నిలిచింది. ఈ సిరీస్ కేవలం వ్యూయర్‌‌షిప్ రికార్డునే కాదు వాట్ టైంలోనూ బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. జియో హాట్‌స్టార్‌లో65 బిలియన్ల మినిట్స్ వాచ్ టైం నమోదైంది. అలాగే, ఓవల్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టు కూడా ఓ రికార్డు సృష్టించింది. ఆ మ్యాచ్‌ను 13 మిలియన్ల వ్యూయర్స్ వీక్షించగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా చూసిన టెస్టు మ్యాచ్ అదే.


Next Story