RCB జ‌ట్టును కొనుగోలు చేయ‌బోయేది వీళ్లే?

by velandi.Saikiran |

ది హండ్రెడ్ లీగ్ లోని వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీకి అమెరికన్ టెక్ బిలినీయర్ సంజయ్ గోవిల్, గ్లామోర్గాన్ క్రికెట్ క్లబ్

RCB జ‌ట్టును కొనుగోలు చేయ‌బోయేది వీళ్లే?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: 2025 ఐపీఎల్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన ఆర్సీబీ ( RCB) జట్టును విక్రయించేందుకు డియాజియో సిద్ధమైన సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి ఈ జట్టుకు కొత్త ఓనర్ కూడా రాబోతున్నట్లు ప్రకటన వెలువడింది. ఇలాంటి నేపథ్యంలో ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు చాలా కంపెనీలు దేశీయ, విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అయితే తాజాగా మరో కొత్త కంపెనీ పేరు తెరపైకి వచ్చింది. ది హండ్రెడ్ లీగ్ లోని వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ యజమానులు ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట.

ది హండ్రెడ్ లీగ్ లోని వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీకి అమెరికన్ టెక్ బిలినీయర్ సంజయ్ గోవిల్, గ్లామోర్గాన్ క్రికెట్ క్లబ్ యజమానులుగా ఉన్నారన్న సంగ‌తి తెలిసిందే. అమెరికా మేజర్ క్రికెట్ లీగ్ లోని వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు కూడా ఓనర్ గా ఉన్నారు సంజయ్ గోవిల్. ఇప్పుడు ఆర్సీబీని జట్టును కొనుగోలు చేసేందుకు సంజయ్ గోవిల్ ఆసక్తి చూపిస్తున్నారట. ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయాలంటే దాదాపు రెండు బిలియన్ల డాలర్లు అవసరం. ఆ మేరకు ఖర్చు చేసేందుకు సంజయ్ గోవిల్ ఏ మాత్రం వెనకాడడం లేదని తెలుస్తోంది.

Next Story