భారత కెప్టెన్లకు ర్యాంక్‌లు ఇచ్చిన రాయుడు. ధోనీకి నం.1 ర్యాంక్.. రోహిత్, కోహ్లీ ర్యాంక్ ఎంతో తెలుసా?

by Harish |

భారత కెప్టెన్లలో ఎం.ఎస్ ధోనీ నం.1 సారథి అని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపాడు.

భారత కెప్టెన్లకు ర్యాంక్‌లు ఇచ్చిన రాయుడు. ధోనీకి నం.1 ర్యాంక్.. రోహిత్, కోహ్లీ ర్యాంక్ ఎంతో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : భారత కెప్టెన్లలో ఎం.ఎస్ ధోనీ నం.1 సారథి అని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాయుడు భారత క్రికెట్ కెప్టెన్ల బ్లైండ్ ర్యాంకింగ్ చాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా భారత కెప్టెన్లకు ర్యాంకింగ్స్ ఇచ్చిన రాయుడు.. ఎం.ఎస్‌ ధోనీకి నం.1 ర్యాంక్ ఇచ్చాడు. మాహీ కెప్టెన్సీలో భారత జట్టు టీ20 వరల్డ్ కప్(2007), వన్డే వరల్డ్ కప్(2011), ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(2013) గెలిచిన విషయం తెలిసిందే. అలాగే, ఐపీఎల్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలబెట్టాడు. 17 ఏళ్ల తర్వాత టీమిండియాకు పొట్టి ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మకు రాయుడు రెండో స్థానం ఇచ్చాడు. రోహిత్ నేతృత్వంలోనే భారత్ ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌‌ను విజయవంతమైన జట్టుగా నిలబెట్టాడు. అతని నాయకత్వంలో ముంబై ఐదుసార్లు టైటిల్ ఎగరేసుకపోయింది. రాయుడు జాబితాలో సౌరవ్ గంగూలీ మూడో స్థానం, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్‌ 4వ స్థానంలో నిలిచారు. ఇక, విరాట్ కోహ్లీకి రాయుడు 5వ స్థానం ఇవ్వగా.. మాజీ కెప్టెన్ అహ్మద్ అజారుద్దీన్‌కు 6వ స్థానం ఇచ్చాడు.


Next Story