Boxing Day Test : బాక్సిండ్ డే టెస్ట్.. తొలి రోజు టికెట్లన్నీ సోల్డ్ ఔట్

by Sathputhe Rajesh |

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే టెస్ట్‌లో తలపడనున్నాయి.

Boxing Day Test : బాక్సిండ్ డే టెస్ట్.. తొలి రోజు టికెట్లన్నీ సోల్డ్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే టెస్ట్‌లో తలపడనున్నాయి. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ నాల్గవ టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించి తొలి రోజు టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఎంసీజీ మైదానంలో 90వేల మంది ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్ వీక్షించే కెపాసిటీ ఉంది. అడిలైడ్‌లో జరిగిన పింక్ టెస్ట్ మూడో రోజు 1,35,012 మంది హాజరైనట్లు బోర్డు తెలిపింది. 2014-15లో ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు 1,13,009 మంది హాజరు కాగా అదే ఇప్పటి వరకు హయ్యస్ట్ నెంబర్‌గా ఉంది. దీంతో తాజా గణాంకాలు ఆ రికార్డును అధిగమించాయి. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పుంజుకుని 10 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. మూడో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.

Next Story