వరల్డ్ నం.2ను చిత్తు చేసిన లక్ష్యసేన్.. ఆల్‌ ఇంగ్లాండ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు

by Harish |

భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సంచలన విజయం సాధించాడు.

వరల్డ్ నం.2ను చిత్తు చేసిన లక్ష్యసేన్.. ఆల్‌ ఇంగ్లాండ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సంచలన విజయం సాధించాడు. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో వరల్డ్ నం.2, డిఫెండింగ్ చాంపియన్ జోనాటన్ క్రిస్టీ(ఇండోనేషయా)ను చిత్తు చేశాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో 21-13, 21-10 తేడాతో నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. తనకంటే మెరుగైన ప్లేయర్‌పై లక్ష్యసేన్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. అతని దూకుడు ముందు డిఫెండింగ్ చాంపియన్ కనీస ఇవ్వలేకపోయాడు. వరుసగా రెండు గేములను ఏకపక్షంగా గెలుచుకుని కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్ రెండో రౌండ్‌లో ఇంటిదారిపట్టింది. జపాన్‌కు చెందని యుమగూచి చేతిలో 21-16, 21-13 తేడాతో ఓడిపోయింది. భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌-చిరాగ్ జంట రెండో రౌండ్‌లో ఆట మధ్యలోనే తప్పుకుంది. చైనా ఆటగాళ్ల చేతిలో 21-16తో తొలి గేమ్ కోల్పోయారు. రెండో గేమ్ ఆరంభమైన తర్వాత చిరాగ్ వెన్ను నొప్పితో బాధపడటంతో భారత జంట గేమ్ నుంచి వైదొలిగింది.


Next Story