IND VS ENG: కుప్పకూలిన ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్.. ఇద్దరు డకౌట్

by velandi.Saikiran |

ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో గిల్ ( Gill) టీం అద్భుతంగా

IND VS ENG: కుప్పకూలిన ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్.. ఇద్దరు డకౌట్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో గిల్ ( Gill) టీం అద్భుతంగా రాణిస్తోంది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేయగా.. ఇప్పుడు బౌలింగ్ లో కూడా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. ఇద్దరూ డకౌట్ అయ్యారు. మొన్నటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన డకెట్ (Ben Duckett) నడ్డి విరిచాడు కొత్త బౌలర్ ఆకాష్ దీప్ ( Akash Deep).

రెండో టెస్ట్ లో ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ దీప్... రెండు వికెట్లు పడగొట్టాడు. డకెట్ తో పాటు పోప్ ను (Ollie Pope) కూడా డకౌట్ చేశాడు. ఇలా ఈ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టాడు ఆకాష్ దీప్. ఇక అటు తెలంగాణ డిఎస్పి సిరాజ్ ( DSP Siraj)... జాక్ ( Zak Crawley ) వికెట్ తీసి దుమ్ము లేపాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 66 పరుగులు చేసింది. 15 ఓవర్లు పూర్తిగా గా మూడు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఇక అంతకుముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 587 పరుగులకు ఆల్ అవుట్ అయింది. గిల్ డబల్ సెంచరీ చేయగా.. యశస్వి జైస్వాల్ అలాగే రవీంద్ర జడేజా సెంచరీలు మిస్ చేసుకున్నారు.

Next Story