ఆ లేడీని చీట్ చేసిన టీమిండియా మాజీ ప్లేయర్..ఉల్లిగడ్డలు చూపించి

by velandi.Saikiran |

న భార్య ఉల్లిగడ్డలను ఏరుకుంటూ కవర్ లో వేశారు. అయితే కవర్లో వేసిన ఉల్లిగడ్డలను తన భార్యకు చూపిస్తూ.. ఇవి ఓకేనా అంటూ

ఆ లేడీని చీట్ చేసిన టీమిండియా మాజీ ప్లేయర్..ఉల్లిగడ్డలు చూపించి
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ ఆకాష్ చోప్రా ( Aakash Chopra ) గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో టీమిండియా కు సేవలు అందించిన ఆకాశ్ చోప్రా ప్రస్తుతం.. కామెంట్రీ చేస్తున్నాడు. ఇండియా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో జరిగే మ్యాచ్ లకు కామెంట్ చేస్తూ ఉంటాడు ఆకాశ్ చోప్రా.

అదే సమయంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ... వీడియోలు కూడా పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తన భార్యతో ఓ రీల్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. షాపింగ్ కు వెళ్లిన ఆకాష్ చోప్రా.. ఉల్లిగడ్డలు కొన్నారు. ఈ సందర్భంగా తన భార్య ఉల్లిగడ్డలను ఏరుకుంటూ కవర్ లో వేశారు. అయితే కవర్లో వేసిన ఉల్లిగడ్డలను తన భార్యకు చూపిస్తూ.. ఇవి ఓకేనా అంటూ ఆమె పర్మిషన్ తీసుకున్నాడు.

కానీ వాటిని ఆమె రిజెక్ట్ చేసి పక్కకు పారేశారు. వాస్తవానికి ముందుగా ఆమె సెలెక్ట్ చేసి కవర్లో వేసిన ఉల్లిగడ్డలనే.. ఆకాష్ చోప్రా చూపించాడు. కానీ తన భర్త చూపించింది కచ్చితంగా బాగుండదని.. ఫిక్సయి ఆ ఉల్లిగడ్డలను పక్కకు పెట్టడం మొదలుపెట్టింది. ఆ వీడియోని ఆకాష్ చోప్రా తాజాగా పంచుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. భార్య బాధితులు చూసి నవ్వుకుంటున్నారు. మా అందరి పరిస్థితి ఇలాగే తయారైందని అంటున్నారు.

Instagramme Link

Next Story