అజింక్య రహానే షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ట్వీట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-21 12:07:03  IST  )

భారత మాజీ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

అజింక్య రహానే షాకింగ్ నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు ముంబై దేశవాళీ క్రికెట్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ముంబై క్రికెట్‌లో నాయకత్వ పాత్ర నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన రహానే, కొత్త నాయకుడిని తయారు చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రహానే తన ట్వీట్‌లో "ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉండటం, ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.

కొత్త దేశవాళీ సీజన్ దగ్గరలో ఉండటంతో కొత్త నాయకుడిని తయారు చేయడానికి ఇదే సరైన సమయం అని నేను నమ్ముతున్నాను. అందుకే నేను కెప్టెన్సీ పాత్రలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాను. ఆటగాడిగా నా అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడానికి నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. మరిన్ని ట్రోఫీలను గెలుచుకోవడంలో మాకు సహాయపడటానికి ముంబై జట్టుతో నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. వచ్చే సీజన్ కోసం ఎంతగానో సీజన్ కోసం ఎదురు చూస్తున్నాను." అని రహానే తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

Next Story