- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెలెక్టర్లుగా ఉండాల్సింది వాళ్లు.. సెలెక్టర్ల ఎంపికపై రహానే కీలక వ్యాఖ్యలు
భారత క్రికెట్‌లో సెలెక్టర్ల ఎంపిక ప్రక్రియపై టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెట్‌లో సెలెక్టర్ల ఎంపిక ప్రక్రియపై టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా దేశవాళీ స్థాయిలో సెలెక్టర్ల ఎంపికలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారాతో కలిసి రహానే మాట్లాడుతూ.. ఇటీవల రిటైర్డ్ అయిన ప్లేయర్లను సెలెక్టర్లుగా ఎంపిక చేయాలని సూచించాడు. వారు మాత్రమే మారుతున్న ఆధునిక క్రికెట్‌ను అర్థం చేసుకోగలరని, అందుకు అనుగుణంగా ప్లేయర్లను ఎంపిక చేయగలరని అభిప్రాయపడ్డాడు. ‘సెలెక్టర్లకు ప్లేయర్లు భయపడకూదు. ఉన్నతస్థాయి క్రికెట్ ఆడి ఇటీవల రిటైర్ అయిన వారు సెలెక్టర్లుగా ఉండాలి. 5-8ఏళ్ల క్రితం రిటైర్ అయి ఉండాలి. క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే, తాజాగా రిటైర్ అయిన వారు సెలెక్టర్లుగా ఉండటం అవసరం. 20-30 ఏళ్ల క్రితం క్రికెట్ ఎలా ఆడారన్న దానిపై నిర్ణయాలు తీసుకోవడం మాకు అక్కర్లేదు. టీ20, ఐపీఎల్ ఫార్మాట్లతోపాటు ఆధునిక క్రికెట్ ఆటగాళ్ల శైలిని అర్థం చేసుకోవడం ముఖ్యం. అన్ని రాష్ట్రాల నుంచి సెలెక్టర్లు ఉండాలి. ప్లేయర్లు స్వేచ్ఛగా, భయం లేకుండా ఆడాలి.’అని రహానే చెప్పుకొచ్చాడు.






