నాలుగో టెస్టులో ఆ పని చేయండి.. టీమిండియాకు రహానే కీలక సూచన

by Harish |   (  Updated:2025-07-18 14:39:02  IST  )

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టు కూర్పుపై సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే కీలక సూచన చేశాడు.

నాలుగో టెస్టులో ఆ పని చేయండి.. టీమిండియాకు రహానే కీలక సూచన
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు ముందు భారత జట్టు కూర్పుపై సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే కీలక సూచన చేశాడు. జట్టులోకి మరో మెయిన్‌స్ట్రీమ్ బౌలర్‌ను తీసుకోవాలని సూచించాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో రహానే మాట్లాడుతూ..‘4,5 రోజులు బ్యాటింగ్ చేయడానికి కష్టంగా ఉంటుందని అందరికీ తెలుసు. పరుగులు సులభంగా రావు. ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, తొలి ఇన్నింగ్స్‌‌లో భారత్ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. నాలుగో టెస్టులో టీమిండియా తుది జట్టులోకి మరో బౌలర్‌ను తీసుకోవాలి. ఎందుకంటే 20 వికెట్లు తీస్తే టెస్టు మ్యాచ్, సిరీస్‌ను గెలుచుకోవచ్చు.’అని రహానే తెలిపాడు. మూడో టెస్టులో బుమ్రా ,సిరాజ్, ఆకాశ్ దీప్ మెయిన్‌స్ట్రీమ్ బౌలర్లు కాగా జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీ రెడ్డి ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగారు. మూడో టెస్టు ఓటమి అనంతరం నితీశ్‌ను తుది జట్టు నుంచి తప్పించాలనే చర్చ జరుగుతుంది. అతన్ని తప్పిస్తే స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.


Next Story