- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్..సెలక్టర్ల పరువు తీసిన రహానే
టెస్టుల్లో తనను సెలెక్ట్ చేయకపోవడంపై టీమిండియా స్టార్ ఆటగాడు అజింక్య రహానే ( Ajinkya Rahane ) చాలా సీరియస్ అయ్యారు

దిశ, వెబ్ డెస్క్: టెస్టుల్లో తనను సెలెక్ట్ చేయకపోవడంపై టీమిండియా స్టార్ ఆటగాడు అజింక్య రహానే ( Ajinkya Rahane ) చాలా సీరియస్ అయ్యారు. ఒకప్పుడు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ జరిగితే తనను వాడుకున్నారని... ఇప్పుడు అద్భుతంగా రాణిస్తున్న కూడా సెలెక్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రహానే. ఛత్తీస్‌ఘడ్ తో రంజీ మ్యాచ్ లో ఏకంగా 159 పరుగులు చేశాడు రహానే. ఈ సందర్భంగా టీమిండియా సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ రహానే పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచనలు చేశారు.
అలాంటప్పుడే టీం ఇండియాలో మంచి ప్లేయర్లు ఉంటారని తెలిపాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ హసీ 30 ఏళ్ల వయసుకు జట్టులోకి అరంగేట్రం చేశాడని గుర్తు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్ లో ఏజ్ కంటే అనుభవం చాలా ముఖ్యమని కౌంటర్ ఇచ్చాడు. నాలాంటి ప్లేయర్లు బాగా రాణిస్తే, ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలని ఫైర్ అయ్యారు. టీమిండియా నుంచి తనను తొలగించేటప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దారుణంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ ఇద్దరు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు నెలకొన్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం రహానే వయసు 37 సంవత్సరాల సంగతి తెలిసిందే. 2023 జూలైలో వెస్టిండీస్ పై తన చివరి టెస్ట్ ఆడాడు రహానే.






