- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SMAT : అజింక్య రహానే వీర బాదుడు.. ఫైనల్‌కు చేరిన ముంబై
రహానే 56 బంతుల్లో 98 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.

దిశ, స్పోర్ట్స్ : రహానే 56 బంతుల్లో 98 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బరోడాపై ముంబై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. శుక్రవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లకు 158/7 పరుగులు చేసింది. బరోడా జట్టులో శశ్వత్ రవాత్ (33), శివలిక్ శర్మ (36 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో సూర్యాంశ్ షెడ్గే 11/2, తనుష్ కొటియన్16/1తో రాణించారు. అనంతరం 159 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు కేవలం 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి 164/4 చేసింది. అజింక్య రహానే (98) ఐదు సిక్సులు, 11 బౌండరీలు బాదడంతో16 బంతులు మిగిలి ఉండగానే ముంబై విక్టరీ సాధించింది. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(46) అద్భుతమైన బ్యాటింగ్ చేసి రాణించాడు. ఈ విజయంతో ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు వరుసగా రెండో సారి చేరినట్లయింది.






