Mahieka Sharma: పిన్నితో మ్యాచ్ చూసిన పాండ్యా కొడుకు !

by velandi.Saikiran |

వాంఖడే స్టేడియం వీఐపీ గ్యాలరీలో మహికా శర్మ, అగస్త్య పాండ్యా ఇద్దరు కూర్చొని హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ను తిలకించారు.

Mahieka Sharma: పిన్నితో మ్యాచ్ చూసిన పాండ్యా కొడుకు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ముంబై వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ వాంఖడే స్టేడియంలో మెరిశారు. ప్రతి మ్యాచ్ కు వ‌స్తోన్న‌ మహికా, ఈ సెమీ ఫైనల్ లో మాత్రం హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే వాంఖడే స్టేడియం వీఐపీ గ్యాలరీలో మహికా శర్మ, అగస్త్య పాండ్యా ఇద్దరు కూర్చొని హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ను తిలకించారు. మ్యాచ్ చివరి వరకు ఉన్న ఈ ఇద్దరు, ఆ తర్వాత ముంబైలోని హార్దిక్ పాండ్యా ఇంటికి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పిన్నితో అగస్త్య పాండ్యా మ్యాచ్ చూసాడని కామెంట్స్ చేస్తున్నారు. సెకండ్ సెటప్ మైంటైన్ చేస్తున్న హార్దిక్ పాండ్యా... తన కొడుకును కూడా మహికా శర్మకు దగ్గర చేయడం అందరిని ఆకట్టుకుంటోంది. ఇది ఇలా ఉండగా నటాషా, హార్దిక్ పాండ్యాకు పుట్టిన వాడే ఈ ఆగస్త్య పాండ్యా. పెళ్లి కంటే ముందే అగస్త్య పాండ్యాకు జన్మనిచ్చింది నటాషా. ఆ తర్వాత పాండ్యా, నటాషా వివాహం చేసుకున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు వివాహ బంధాన్ని ఎంజాయ్ చేసి, రెండు సంవత్సరాల కిందట విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు అగస్త్య కొన్ని రోజులు తన తండ్రి పాండ్యా దగ్గర ఉంటూ.. మరి కొన్ని రోజులు నటాషా దగ్గర ఉంటున్నాడు. కాగా త్వ‌ర‌లోనే మ‌హికా శ‌ర్మ‌ను పాండ్యా పెళ్లి చేసుకుంటార‌ని అంటున్నారు.

Next Story