- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్ విగ్రహం
by Harish |
వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విగ్రహాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేయనుంది.

X
దిశ, స్పోర్ట్స్ : ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విగ్రహాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఏర్పాటు చేయనుంది. భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన గవాస్కర్ గౌరవార్థం ఎంసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న ఎంసీఏ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. ఈ మ్యూజియానికి ఎంసీఏ మాజీ ప్రెసిడెంట్ శరద్ పవార్ పేరు పెట్టబోతున్నారు. అదే రోజు గవాస్కర్ నిలువెత్తు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. శరద్ పవార్ స్టాచ్యూను కూడా ఏర్పాటు చేయనున్నారు. మ్యూజియంలో 28 మంది క్రికెటర్లు ఇచ్చిన జ్ఞాపికలను పొందుపర్చనున్నట్టు ఎంసీఏ సెక్రెటరీ అభయ్ తెలిపారు. 2023లో సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఎంసీఏ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Next Story






