- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె నాకు చెల్లలు లాంటింది.. సింగర్‌తో ప్రేమ వార్తలపై స్పందించిన సిరాజ్
by Harish |
బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి.

X
దిశ, స్పోర్ట్స్ : బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఆమె బర్త్ డే వేడుకల్లో సిరాజ్ పాల్గొన్నాడు. వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వారు ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై సిరాజ్, జనై క్లారిటీ ఇచ్చారు. ముందుగా జనై సిరాజ్ తనకు అన్నయ్యలాంటి వాడని చెప్పేలా ‘మై డియర్ బ్రదర్’ అని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. జనై పోస్టుకు సిరాజ్ బదులిచ్చాడు. జనై భోస్లే తనకు చెల్లెలు లాంటిదని చెప్పాడు. ‘ఆమెలాంటి సోదరి నాకెవరూ లేరు. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్టే.. ఆమె వెయ్యి మందిలో ఒకరు.’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీంతో సిరాజ్, జనై ప్రేమలో ఉన్న వార్తలకు ఫుల్‌స్టాఫ్ పడింది.
- Tags
- #Mohammed Siraj
Next Story






