- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్సీబీ ఒక్కటే కాదు, ఐపీఎల్‌లో అమ్మకానికి మరో జట్టు!
ఐపీఎల్ లో ఒకటి కాదు, రెండు జట్లు అమ్మకానికి ఉన్నాయి అంటూ హర్ష్ గోయెంకా వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అమ్మేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2026 మార్చి 31 సమయానికి RCB జట్టుకు కొత్త ఓనర్ కూడా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆర్సీబీ ఒక్కటే కాదు, ఐపీఎల్ లో ఉన్న మరో జట్టును కూడా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం అందుతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టును అమ్మకానికి పెట్టినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రముఖ బిజినెస్ మాన్ హర్ష్ గోయెంకా కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి తెలిపారు.
ఐపీఎల్ లో ఒకటి కాదు, రెండు జట్లు అమ్మకానికి ఉన్నాయి అంటూ హర్ష్ గోయెంకా వెల్లడించారు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు జట్లను అమ్మేస్తున్నారు.. ఈ రెండు జట్లను కొనుగోలు చేసేందుకు ఐదుగురు బడా వ్యాపారవేత్తలు రేసులో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, పూణే నగరాల నుంచి కొత్త ఓనర్లు వస్తారు కావచ్చు అంటూ అంచనా వేశారు హర్ష్ గోయెంకా. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన జరగనుంది. ఈ ఈవెంట్ ను ముందుగా ముంబైలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ముంబై నుంచి అబుదాబీకి షిఫ్ట్ చేసింది బీసీసీఐ. ఇక ఐపీఎల్ 2026 టోర్నమెంటును, మార్చిలో ప్రారంభించబోతున్నారు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫినిష్ కాగానే ఈ ఐపీఎల్ 2026 ప్రారంభమవుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మార్చి 15వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఐపీఎల్ 2026 మెగా టోర్నమెంట్ జరగనుంది.






