పాకిస్తాన్ ఓట‌మిపై సంబ‌రాలు..చిత‌క‌బాదిన పోలీసులు, వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

పాకిస్తాన్ పై భార‌త్ గెలిచిన నేప‌థ్యంలో ర్యాష్ డ్రైవింగ్ చేసిన భార‌త ఫ్యాన్స్ ను పోలీసులు చిత‌క‌బాదారు.

పాకిస్తాన్ ఓట‌మిపై సంబ‌రాలు..చిత‌క‌బాదిన పోలీసులు, వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా మొన్న భార‌త్, పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పాక్ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏకంగా 61 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది భార‌త జ‌ట్టు. దీంతో దేశ వ్యాప్తంగా సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. చిన్న‌, పెద్ద అనే తేడా లేకుండా, ఇండియా వ్యాప్తంగా అంద‌రూ ఎగిరిగంతేశారు. ఈ త‌రుణంలోనే కొత్త మంది ఇండియ‌న్ ఫ్యాన్స్ రోడ్ల‌పైకి వ‌చ్చి మ‌రీ, రెచ్చిపోయారు.

పాకిస్తాన్ ఓట‌మిపై సంబ‌రాలు..చిత‌క‌బాదిన పోలీసులు, వీడియో వైర‌ల్‌

పాకిస్తాన్ పై ఆదివారం భారత జట్టు విజయం సాధించిన నేపథ్యంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. భారతదేశ వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి, అర్థరాత్రి రచ్చ రచ్చ చేశారు. కొంతమంది టపాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయోధ్యలో సాధువులు సైతం ఈ సంబరాల్లో పాల్గొన్నారు. స్వీట్లు పంచి, సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే కొంత మంది యువత బైక్ రైడ్స్ చేస్తూ కూడా సంబరాలు చేసుకున్నారు. రోడ్ల పైన స్టంట్స్‌ చేస్తూ ఓవ‌ర్ గా బిహేవ్ చేశారు. అయితే రోడ్లపై బైక్స్ తో స్టంట్స్‌ చేసిన వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

రోడ్లపైకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సంబరాలు చేసుకున్న అభిమానులందరికీ చితకబాదీ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. అయితే ఆలస్యంగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. జనాలందరూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ భారత అభిమాని... ర్యాష్‌ డ్రైవింగ్ చేస్తూ జనాల్లోకి దూసుకు వచ్చాడు. అయితే అతని వెంటనే రౌండప్ చేసిన పోలీసులు చితకబాదారు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనను వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ పరిస్థితి దారుణం

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు సాధించింది. ఇందులో ఇషాన్ కిష‌న్ ఒక్కడే 70కి పైగా పరుగులు చేశాడు. అయితే ఈ 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ ఇక్కడ కూడా పోటీ ఇవ్వలేదని తెలుస్తోంది. మొదటి నుంచి వికెట్లను కోల్పోయిన పాకిస్తాన్, ఆ తర్వాత కోలుకోలేదు. మిడిల్ ఆర్డర్ లో అయిన బలపడుతుందని అందరు అనుకున్నారు. కానీ భారత స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. టైం దొరికితే చాలు వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్తాన్ ఓటమి పాలైంది. పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో సూపర్ 8 కాంపిటీషన్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే గ్రూప్ ఏ లో ఉన్న ఇండియా సూపర్ 8 లోకి వచ్చేసింది. ఇప్పుడు అమెరికా, పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ ఉండనుంది. ఈ రెండు జట్లలో ఒక టీం సూపర్ 8 లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. క్లిక్

Next Story