- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్ ట్రై సిరీస్ నుంచి వైదొలిగిన అఫ్గానిస్తాన్.. అసద్ ఉల్లా ఖాన్ కీలక వ్యాఖ్యలు
అఫ్గానిస్తాన్, పాకిస్థాన్ మధ్య ఇటీవల నెలకొన్న యుద్ద పరిస్థితుల గురించి విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల మధ్య ఇరు దేశాల మధ్య గతంలో షెడ్యూల్ చెయబడిన ట్రై సిరీస్ పై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అఫ్గానిస్తాన్, పాకిస్థాన్ మధ్య ఇటీవల నెలకొన్న యుద్ద పరిస్థితుల గురించి విషయం తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల మధ్య ఇరు దేశాల మధ్య గతంలో షెడ్యూల్ చెయబడిన ట్రై సిరీస్ పై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌లో జరగాల్సిన ట్రై సిరీస్ నుంచి తాము వైదొలగి నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై అప్ఘనిస్తాన్ దేశ మాజీ క్రికెటర్, కోచ్, చీఫ్ సెలెక్టర్ అసద్ ఉల్లా ఖాన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. “ఏ దేశ గౌరవాన్ని దెబ్బతీయడం సరైన విషయం కాదు. అలాంటి పరిస్థితిని ఏ దేశం అయినా అంగీకరించదు. కాబట్టి అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనదే అని తాను భావిస్తున్నానని” చెప్పుకొచ్చాడు.
అలాగే ఆయన భారత క్రికెట్ బోర్డుపై ప్రశంసలు కురిపించాడు. “మేము అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తరఫున భారతదేశానికి చెందిన పలు కోచ్‌లను మా జట్టుతో పనిచేయడానికి ఆహ్వానించాం. వాళ్ల స్పందన చాలా సానుకూలంగా ఉంది. నాకు భారత జట్టులో నచ్చే విషయం ఏమిటంటే, వారు తమ దేశీయ కోచ్‌లు అయిన గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్, గంగూలి వంటి వారిని నియమిస్తారు. ఇది చాలా మంచి నిర్ణయం, బీసీసీఐ తీసుకున్న ఈ అడుగు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు. అఫ్గానిస్తాన్ జట్టు ఈ నిర్ణయంతో పాకిస్తాన్‌తో సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అఫ్గాన్ బోర్డు మాత్రం దేశ గౌరవం, జట్టు భద్రత ప్రధానమని స్పష్టం చేసింది.






