- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AFG Vs BAN : బంగ్లాదేశ్‌కు అఫ్గానిస్తాన్ బిగ్ షాక్
by Mahesh Kanagandla |
బంగ్లాదేశ్‌కు అఫ్గానిస్తాన్ జట్టు బిగ్ షాక్ ఇచ్చింది. మూడు వన్డేల్లో భాగంగా రెండు జట్ల మధ్య యూఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో గెలుపొందింది.

X
దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌కు అఫ్గానిస్తాన్ జట్టు బిగ్ షాక్ ఇచ్చింది. మూడు వన్డేల్లో భాగంగా రెండు జట్ల మధ్య యూఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 49.4 ఓటర్లకు 235 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్గాన్ జట్టులో నబి(84), షహిదీ (52) అర్థ శతకాలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 34.3 ఓవర్లలో 143 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ జట్టు కేవలం 23 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి అఫ్గాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అల్లా ఘజన్ఫర్ తొలి వన్డే మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టి బంగ్లా జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసి సత్తా చాటాడు.
Next Story






