అఫ్గాన్ విజయంతో నిష్ర్కమణ.. కెనడాపై భారీ విక్టరీ

by Harish |

అఫ్గాన్ విజయంతో నిష్ర్కమణ.. కెనడాపై భారీ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్-2026లో అఫ్గానిస్తాన్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఆ జట్టు‌కు ఊరటనిచ్చే విజయం దక్కింది. శుక్రవారం చెన్నయ్‌లో కెనడాతో జరిగిన తమ ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో అఫ్గాన్ విజయంతో టోర్నీని ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 200 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 95 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. సెడిఖుల్లా అటల్(44), గుర్బాజ్(30) కూడా పర్వాలేదనిపించారు. ఇక, ఛేదనలో కెనడా పెద్దగా ఆకట్టుకోలేదు. 20 ఓవర్లలో 118/8 స్కోరుకే పరిమితమైంది. హర్ష్ ఠాకూర్(30) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ రన్స్ చేయపోవడంతో ఆ జట్టు భారీ ఓటమిని చవిచూసింది. అఫ్గాన్ బౌలర్ మహమ్మద్ నబీ 4 వికెట్లతో చెలరేగగా.. రషీద్ ఖాన్ కూడా 2 వికెట్లు పడగొట్టాడు.


Next Story