- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australia vs India, 2nd Test: అడిలైడ్ టెస్టులో తొలి రోజు అస్ట్రేలియా 86/1
బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా అస్ట్రేలియా(Australia), ఇండియా(India)ల మధ్య అడిలైడ్ (Adelaide)వేదికగా జరుగుతున్న రెండో టెస్టు(Second Test)లో తొలి ఇన్నింగ్స్ లో అసీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు

దిశ, వెబ్ డెస్క్ : బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా అస్ట్రేలియా(Australia), ఇండియా(India)ల మధ్య అడిలైడ్ (Adelaide)వేదికగా జరుగుతున్న రెండో టెస్టు(Second Test)లో తొలి ఇన్నింగ్స్ లో అసీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ ను అసీస్ బ్యాటర్లు అచితూచి ఆడగా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 33ఓవర్లలో అస్ట్రేలియా 86/1పరుగుల వద్ధ నిలిచింది. 24పరుగుల వద్ధ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(13) వికెట్ ను కోల్పోయిన ఆసీస్ ను మరో ఓపెనర్ మెక్ స్వీని(38*), లబుషైన్ (20*)పరుగులతో ఆదుకున్నారు.
22 ఓవర్ల పాటు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి తొలి రోజు ఆటను ముగించారు. ప్రస్తుతం అసీస్ తొలి ఇన్నింగ్స్ టీమిండియా స్కోర్ కంటే 94పరుగులు వెనుకబడి ఉంది. ఖవాజా వికెట్ ను బూమ్రా దక్కించుకున్నాడు. అంతకుముందు టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా44.1ఓవర్లలో 180పరుగులకు అలౌటైంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అసీస్ పేసర్లు స్టార్కు 6 వికెట్లు, బోలాండ్, కమిన్స్ తలో రెండేసి వికెట్లు సాధించారు.






