ఆసియా కప్ ట్రోఫీ కావాలంటే.. టీమిండియాకు కండీషన్స్ పెట్టిన నఖ్వీ!

by Phanindra |

ఆసియా కప్ ట్రోఫీని భారత్‌కు అందించేందుకు ఏసీసీ చీఫ్ నఖ్వీ అంగీకరించాడు. అయితే ఆ ట్రోఫీ ఇచ్చేందుకు ఒక పెద్ద కండీషన్ పెట్టాడు.

ఆసియా కప్ ట్రోఫీ కావాలంటే.. టీమిండియాకు కండీషన్స్ పెట్టిన నఖ్వీ!
X

దిశ, స్పోర్ట్స్: ఆసియా కప్ ట్రోఫీ ఎత్తుకెళ్లిపోయిన ఏసీసీ, పీసీబీ చీఫ్ మొహ్‌సిన్ నఖ్వీ.. ఆ కప్పును టీమిండియాకు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాడు. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్రోఫీ తిరిగిస్తానన్నాడట. అయితే ఈ ట్రోఫీ, మిగతా మెడల్స్ కోసం అధికారిక కార్యక్రమం నిర్వహించాలని కండీషన్ పెట్టాడట నఖ్వీ. ఆ సెర్మనీలో తానే ట్రోఫీ, మెడల్స్ అందిస్తానని కండీషన్ పెట్టినట్లు సమాచారం. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించిన నేపథ్యంలో.. నఖ్వీ ఇలాంటి కండీషన్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Next Story