- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంత్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్ : బెన్ స్టోక్స్
వరల్డ్‌లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్లలో రిషబ్ పంత్ ఒకడని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ వ్యాఖ్యానించాడు.

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్‌లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్లలో రిషబ్ పంత్ ఒకడని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ వ్యాఖ్యానించాడు. రెండో టెస్టుకు ముందు మాట్లాడిన స్టోక్స్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. పంత్ నిర్భయ ఆట తీరును, మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యాలను మెచ్చుకున్నాడు. వ్యక్తిగతంగా పంత్ ఆట చూడటానికి ఇష్టపడతానని, చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. ‘అతను నాకు ప్రత్యర్థే కావొచ్చు. కానీ, పంత్ ఆడటం ఇష్టంగా చూస్తా. అన్ని ఫార్మాట్లలో అతను ఆటు తీసుకెళ్లే విధానం ఇష్టపడతా. అలాంటి ప్రతిభావంతుడికి స్వేచ్ఛ ఇస్తే ఏం జరుగుతుందో తొలి టెస్టులో చూశాం. రెండు సెంచరీలు చేశాడు. అతను చాలా డేంజరస్ ప్లేయర్. భారత జట్టుకు అతను ఏం చేయగలడో మాకు తెలుసు.’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
తొలి టెస్టులో గెలిచినప్పటికీ రెండో టెస్టులో తాము జీరో నుంచి మొదలుపెడతామని, నాలుగో ఇన్నింగ్స్‌లో ఎంత పెద్ద లక్ష్యమైనా ఛేదిస్తామన్న నమ్మకం తమకు ఉందన్నాడు. బౌలర్ జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీపై మాట్లాడుతూ.. అతని రాక ఇంగ్లాండ్‌కు బలమని, ఈ సిరీస్‌లో అతను భాగమవుతాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. బుమ్రా రెండో టెస్టు ఆడతాడా?లేదా?అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అది టీమిండియా సమస్య అని బదులిచ్చాడు.






