- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ.. 20 ఓవర్లలో 310 స్కోర్
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో పంజాబ్ యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో పంజాబ్ యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసం సృష్టించాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 32 బంతుల్లోనే శతకం (సెంచరీ) నమోదు చేసి రికార్డు సృష్టించాడు. భారత ఆటగాళ్లలో రిషబ్ పంత్ తర్వాత అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా అభిషేక్ నిలిచాడు. ఈ మ్యాచులో అభిషేక్ కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి, క్రికెట్‌లో రెండో వేగవంతమైన అర్ధ సెంచరీ (Fastest half-century) నమోదు చేశాడు.
మొత్తం మ్యాచులో అభిషేక్ శర్మ కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 16 భారీ సిక్సర్లతో జింఖాణ గ్రౌండ్‌లో సునామీ సృష్టించి 148 పరుగులతో బెంగాల్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి తొలి వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో, పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. T20 క్రికెట్ చరిత్రలో 300 మార్కును దాటిన రెండో భారత జట్టుగా పంజాబ్ నిలిచింది. అలాగే అభిషేక్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండో అత్యధిక స్కోరును నమోదు చేసుకున్నాడు. తిలక్ వర్మ 151 పరుగులతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచులో బెంగాల్ గెలవాలంటే 20 ఓవర్లకు 311 పరుగులు చేయాల్సి ఉంది.






