- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పెషల్ సెలబ్రేషన్ అర్థం చెప్పిన అభిషేక్.. ‘ఎల్’ అంటే ఏంటో తెలుసా?
హాఫ్ సెంచరీ, సెంచరీలు చేసిన ప్రతిసారీ అభిషేక్ శర్మ స్పెషల్ సెలబ్రేషన్ చేసుకుంటాడు. అప్పుడు తను చూపించే ‘ఎల్’ అంటే ఏంటో తెలుసా?

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ బౌలర్లను దంచికొట్టిన టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. తన సెలబ్రేషన్ వెనకున్న అర్థాన్ని వివరించాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గ్లవ్ తీసి, షర్ట్ పైకి లాగి ‘ఎల్’ సింబల్ చూపించడం అభిషేక్ అలవాటు. ఐపీఎల్‌లో కూడా ఇదే చేసేవాడీ విధ్వంసకర ఓపెనర్. పాకిస్తాన్‌పై 74 పరుగులతో చెలరేగిన అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అభిషేక్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అసలు ‘ఎల్’ సెలబ్రేషన్ వెనకున్న కథ ఏంటని సూర్య ప్రశ్నించాడు. ‘దాని అర్థం లవ్. మనల్ని, టీమిండియాను సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్యాన్స్, ఐపీఎల్ అభిమానులు కూడా.. మొత్తం ఇండియాను ప్రేమిస్తున్నానని చెప్పే గ్లవ్ లవ్ సిగ్నల్ అది’ అని వివరించాడు.
గిల్‌తో కెమిస్ట్రీ..
తన ఓపెనింగ్ పార్టనర్ శుభ్‌మన్ గిల్‌తో తనకున్న అనుబంధం గురించి కూడా అభిషేక్ శర్మ చెప్పాడు. అండర్-12 సమయం నుంచి తామిద్దరి పార్టనర్‌షిప్ కొనసాగుతోందని, తను ఆడే షాట్లన్నీ గిల్‌కు, గిల్ ఆడే షాట్లు తనకు బాగా తెలుసునని అన్నాడు. ‘నేను ఎప్పుడు ఎగ్రెసివ్ షాట్ ఆడతానో తనకు తెలుసు. తను ఎప్పుడు ఎగ్రెసివ్‌గా ఆడతాడో నాకు తెలుసు. ఒక్కోసారి ఐ కాంటాక్ట్‌తోనే మాకు అర్థం అయిపోతుంది. మా ఇద్దరి మధ్య అలాంటి అండర్‌స్టాండింగ్ ఉంది’ అని చెప్పుకొచ్చాడు.






