సూప‌ర్ 8 పోరు..అభిషేక్ శ‌ర్మ‌పై వేటు, భార‌త తుది జ‌ట్టు ఇదే!

by velandi.Saikiran |

దక్షిణాఫ్రికాతో ఎల్లుండి జరగనున్న సూపర్ 8 మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ స్థానంలో సంజుకు ఛాన్స్ రానుంద‌ట‌.

సూప‌ర్ 8 పోరు..అభిషేక్ శ‌ర్మ‌పై వేటు, భార‌త తుది జ‌ట్టు ఇదే!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ లో ( T20 World Cup) ఎంతో రాణిస్తాడు అనుకున్న అభిషేక్ శర్మ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్ లో ఒక్క పరుగు చేయకుండా మూడు సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో సూపర్ 8 స్టేజ్ లో అభిషేక్ శర్మ ఆడడం సందేహంగా మారింది. దీనికి తగ్గట్టుగానే తాజాగా వికెట్ కీపర్ సంజు శాంసన్ ప్రాక్టీస్ చేస్తూ మెరిశాడు. సూపర్ 8 లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో కీలక మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అభిషేక్ శర్మ పై వేటు, సంజూ శాంసన్ కు ఛాన్స్?

దక్షిణాఫ్రికాతో ఎల్లుండి జరగనున్న సూపర్ 8 మ్యాచ్ లో భారత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మను పక్కకు పెట్టి, అతని స్థానంలో సంజు శాంసన్ ను తీసుకునేందుకు సిద్ధమైందట. ఈ మేరకు గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో సంజు శాంసన్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా తో జరగనున్న మ్యాచ్ చాలా కీలకము. ప్రారంభ మ్యాచ్ లో గెలిస్తే, భారత జట్టును ఆపడం ఎవరి తరం కాదు. అందుకే పటిష్టమైన బలగంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది భారత్.

టీ20 వరల్డ్ కప్ లో మూడుసార్లు అవకాశం వస్తే అభిషేక్ శర్మ వినియోగించుకోలేదు. మూడుసార్లు డకౌట్ అయ్యాడు. అదే సంజు శాంసన్ కు మొన్న అవకాశం వస్తే 20కి పైగా పరుగులు సాధించాడు. అదికూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు సంజు శాంస‌న్‌. అలాగే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సంజు శాంసన్ కు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంజు శాంసన్ ( Sanju) తుది జట్టులో అవకాశం దక్కించుకుంటాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

గంభీర్ దే ఫైన‌ల్ నిర్ణ‌యం ?

అయితే అదే సమయంలో భారత జట్టుకు సంబంధించిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ విభిన్నంగా స్పందించారు. అభిషేక్ శర్మ గురించి తక్కువగా అందరు అంచనా వేస్తున్నారు. అతడు సూప‌ర్ 8 మ్యాచ్ ఆడబోతున్నాడు... అందులో కచ్చితంగా రాణిస్తాడని భరోసా కల్పించారు. కానీ అతన్ని తుది జట్టులో నుంచి తొలగించే ఛాన్స్ ఉండబోదని పరోక్షంగా హిట్ ఇచ్చారు మోర్నీ మోర్కెల్. కానీ అభిషేక్ శర్మను ఆడించడం అనేది గౌతమ్ గంభీర్ చేతిలో ఉంటుంది. అతనికి నచ్చకపోతే కచ్చితంగా అభిషేక్ శర్మ పై వేటు పడే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు మోర్నీ మోర్కెల్ చెప్పినా కూడా వినడు గౌతమ్ గంభీర్. మరి తుది జట్టులో ఎవరు అవకాశం దక్కించుకుంటారో చూడాలి.

Next Story