పాకిస్తాన్ తో మ్యాచ్‌..భార‌త్ కు బిగ్ రిలీఫ్‌

by velandi.Saikiran |

ఇండియా, పాక్ మ్యాచ్ కోసం అభిషేక్ శర్మ సిద్ధం అయ్యాడ‌ట‌. ఈ మేర‌కు శ్రీలంక‌కు వెళ్లిన‌ట్లు అభిషేక్ శర్మ చెబుతున్నారు.

పాకిస్తాన్ తో మ్యాచ్‌..భార‌త్ కు బిగ్ రిలీఫ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్ (India ) , పాకిస్తాన్ ( Pakistan) మధ్య మ్యాచ్ కు సమయం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల్లోనే ఈ దాయాదుల మధ్య ఫైట్ జరగనుంది. ఆసియా కప్ 2025 సమయంలో ఇండియా అటు పాకిస్తాన్ రెండు జట్లు తలపడ్డాయి. మళ్లీ చాలా రోజుల తర్వాత టీ20 వరల్డ్ కప్ 2026 లో (T20 World Cup) భారత్, పాకిస్తాన్ మధ్య ఫైట్ జరగనుంది. అస‌లు ముందుగా, భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉండ‌బోద‌ని అంద‌రూ అంచ‌నా వేసుకున్నారు. బంగ్లాదేశ్ కార‌ణం చూపి, భార‌త్ మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తామ‌ని హెచ్చ‌రించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ త‌రుణంలోనే రంగంలోకి దిగిన ఐసీసీ, మ్యాటర్ సెటిల్ చేసింది. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ య‌థావిధంగా షెడ్యూల్ అయింది.

పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం అభిషేక్ శర్మ సిద్దం

కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కంటే ముందు భారత జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. నమీబియాతో మ్యాచ్ కు దూరమైన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరమవుతాడని అందరూ టెన్షన్ పడ్డారు. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ కోసం అభిషేక్ శర్మ సిద్ధమయ్యాడని అంటున్నారు. ఇందులో భాగంగా భారత జట్టుతో పాటు శ్రీలంక చేరుకున్నాడట అభిషేక్ శర్మ. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ లెక్కన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ (Abhishek Sharma ) అందుబాటులో ఉంటాడని అంటున్నారు. దీంతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అభిషేక్ శర్మ జట్టులో ఉంటే కొండంత బలం అంటున్నారు. సంజు శాంసన్ లాంటి ప్లేయర్ తో పాకిస్తాన్ పై ఆడితే ఇండియా ఓడిపోయే ప్రమాదం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అభిషేక్ శర్మ జట్టులోకి రావడం చాలా ప్లస్ అంటున్నారు.

అభిషేక్ శర్మకు తీవ్ర అనారోగ్యం

టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడ్డాడు. అతడికి వైరల్ ఫీవర్ సోకడమే కాకుండా, తీవ్రమైన కడుపు నొప్పి కూడా చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఆడిన అభిషేక్ శర్మ, నమీబియా తో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. ఆ సందర్భంగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడట అభిషేక్ శర్మ. దీంతో అభిమానులు అందరూ టెన్షన్ పడ్డారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సమయానికి అభిషేక్ శర్మ సిద్ధమవుతాడా ? లేదా ? అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అభిషేక్ శర్మ ఫిట్ అయ్యాడని అంటున్నారు. ఇందులో భాగంగానే శ్రీలంకకు కూడా పయనం అయ్యాడట అభిషేక్ శర్మ. ఇదే జరిగితే పాకిస్తాన్ జట్టుపై మ్యాచ్ కూడా ఆడనున్నాడు అభిషేక్ శర్మ. దీంతో ఇండియన్ ఫాన్స్ కు బిగ్ రిలీఫ్ దక్కింది.

Next Story