- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం.. కేవలం 32 బంతుల్లో శతకం
భారత టీ20 జట్టు యువ ప్లేయర్ అభిషేక్ శర్మ ఈ రోజు హైదరాబాద్ వేదికగా రెచ్చిపోయి ఆడాడు. ఉప్పల్ లోని జింఖానా గ్రౌండ్ వేదికగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత టీ20 జట్టు యువ ప్లేయర్ అభిషేక్ శర్మ ఈ రోజు హైదరాబాద్ వేదికగా రెచ్చిపోయి ఆడాడు. ఉప్పల్ లోని జింఖానా గ్రౌండ్ (Gymkhana Ground) వేదికగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) జరుగుతోంది. ఇందులో భాగంగా బెంగాల్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచులో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 32 బంతుల్లో ఏ ఫోర్లు, 14 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. అలాగే మరో ఓపెనర్ ప్రభు సిమ్రాన్ (32 బంతుల్లో 64 పరుగులు) కూడా వేగంగా ఆడటంతో, పంజాబ్ జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఈ రికార్డుల పరంపర నమోదు కావడం విషేశం.
ఇదిలా ఉంటే ఈ మ్యాచులో పంజాబ్ ఇన్నింగ్స్ మొత్తంలో అసాధారణమైన దూకుడు కనిపించింది. అభిషేక్ శర్మ ఆట తీరు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ టోర్నమెంట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం, కేవలం 12 ఓవర్లలోనే 190 కి పైగా పరుగులు సాధించడం, బెంగాల్ జట్టుకు గట్టి సవాల్ విసిరింది. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన టీమ్ ఇండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా రాబోయే మ్యాచ్‌లలో అతనిపై అంచనాలు మరింత పెరిగాయి.






