ఆసియా కప్‌లో చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ, రిజ్వాన్ అతని తర్వాతే

by Harish |

ఆసియా కప్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ రికార్డును నెలకొల్పాడు.

ఆసియా కప్‌లో చరిత్ర సృష్టించిన అభిషేక్.. కోహ్లీ, రిజ్వాన్ అతని తర్వాతే
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో సంచలన ప్రదర్శన చేస్తున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ రికార్డును నెలకొల్పాడు. టీ20 ఆసియా కప్ ఎడిషన్‌లో 300 పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. మొత్తంగా 6 మ్యాచ్‌ల్లో 309 రన్స్ చేశాడు. ఇంతకుముందు పాకిస్తాన్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ 2022లో 281 రన్స్ చేశాడు. తాజాగా అభిషేక్ అతన్ని వెనక్కినెట్టి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే, ఓ టీ20 టోర్నీ లేదా సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అభిషేక్‌‌ 5వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్(331, వెస్టిండీస్‌పై) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక, టీ20 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, అఫ్గాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ చెరో 196 రన్స్‌తో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. అలాగే, ఇప్పటికే వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదిన అభిషేక్ శ్రీలంకపై మూడో అర్ధ శతకం నమోదు చేశాడు. 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ చేయడం ఇది 6వ సారి కావడం విశేషం.


Next Story