- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్ బౌలర్ కు వార్నింగ్ ఇచ్చిన అభిషేక్ శర్మ
హారిస్ రఫ్ ఓవరాక్షన్ చేశాడు. అభిషేక్ శర్మాను.. హిందీలో ఏదో అన్నాడు. దీంతో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. గొడవకు దిగాడు దీంత

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ప్రస్తుతం సూపర్ ఫోర్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఇప్పటికే వంద పరుగులు దాటింది టీం ఇండియా. అభిషేక్ శర్మ ఇప్పటికే హఫ్ సెంచరీ చేసుకోగా... గిల్ 45 పరుగులు చేసి దుమ్ము లేపాడు.
దాదాపు వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫినిష్ చేసేలా కనిపిస్తున్నారు. వికెట్ నష్టపోకుండా టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో... పాకిస్తాన్ బౌలర్ రెచ్చిపోయాడు. హారిస్ రఫ్ ఓవరాక్షన్ చేశాడు. అభిషేక్ శర్మాను.. హిందీలో ఏదో అన్నాడు. దీంతో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. గొడవకు దిగాడు దీంతో వీళ్లిద్దరి మధ్య మాట పెరిగింది. ఒకరినొకరు దాడి చేసుకోబోయేవారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.






