- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జట్టులో గిల్ లేకపోతే టీమిండియాకు ఓటమే.. డివిలియర్స్ షాకింగ్ కామెంట్స్
గిల్ అద్భుతమైన ఆటగాడు, టి20లో అతను చాలా గ్రేట్ అంటూ కితాబిచ్చారు. ఒకటి లేదా రెండు మ్యాచ్ లలో

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టి20 సిరీస్ లో గిల్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అతన్ని తొలగించి, సంజు శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ క్రికెటర్లు కూడా టీ20 జట్టు నుంచి గిల్ ను తొలగించాలని కోరుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో AB డివిలియర్స్ మాత్రం డిఫరెంట్ గా స్పందించారు.
గిల్ అద్భుతమైన ఆటగాడు, టి20లో అతను చాలా గ్రేట్ అంటూ కితాబిచ్చారు. ఒకటి లేదా రెండు మ్యాచ్ లలో ఫెయిల్యూర్ అయితే, గిల్ ను తొలగించాల్సిన అవసరం లేదని తెలిపారు. గిల్ కు మరికొన్ని అవకాశాలు ఇవ్వండి అని పేర్కొన్నారు. భారత అగ్రసివ్ లైనప్ నకు గిల్ లాంటి ప్లేయర్ అవసరం, అతడు లేకపోతే జట్టు ఓటమి పాలయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. మీరు కోరుకునేలా పెద్ద మ్యాచ్ లలో గిల్ తప్పకుండా పరుగులు చేస్తానని AB డివిలియర్స్ చెప్పుకొచ్చారు.






